ఆంధ్రప్రదేశ్ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఏపీ మెరైన్ పోలీసులు సముద్రంతో పాటు తీర ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో అత్యాధునిక పరికరాలు, పడవలు, నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో మత్స్యకారుల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ అధికారులు ముగించినట్లు ప్రకటించారు. నివేదికను అధికారులు త్రిసభ్య కమిటీకి సమర్పించనున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలున్నాయి.