ఆంధ్రప్రదేశ్ లో 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,076.11 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 19వ ఎస్ఐపీబీ సమావేశంలో ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.రైతు కుటుంబాలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా పారిశ్రామికీకరణకు కృషి చేయాలని సూచించారు. ఇథనాల్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం అందించాలని సూచించారు.100 టూరిస్ట్ స్పాట్‌ల దగ్గర ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటక రంగం నుంచి జీఎస్‌డీపీకి వాటా పెరిగేలా చూడాలి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.