భారత టీ20 జట్టులో ఊహించని మార్పు చోటు చేసుకుంది. జూలై 23 నుండి 26 వరకు జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంజూ శాంసన్ను రీప్లేస్ చేస్తూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లోనే సంజూను పక్కన పెట్టి వైభవ్ కు తుది జట్టులో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే సిరీస్ నుంచి కూడా సంజూను పూర్తిగా తొలగించి, ఆ స్థానాన్ని వైభవ్ తో భర్తీ చేశారు.