విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాల్ మనీ సిండికేట్ తిరిగి కోరలు చాస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన సన్నిహితుడు ముల్పూరి కిశోర్ అరాచకాలు సాగిస్తున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంచలన లేఖ రాశారు. గాయత్రీ నగర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్త రూ. 5 కోట్లు అప్పుగా తీసుకుని, అసలు వడ్డీ కలిపి మొత్తం రూ. 21 కోట్లు చెల్లించినప్పటికీ వెనిగళ్ల హర్షవర్ధన్, వెనిగళ్ల హరినాథ్ లు మరో రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.