ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారనే వార్తలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత వేంపాడు వద్ద తనను మరోసారి అదుపులోకి తీసుకున్నారంటూ ప్రశ్న రావణ్ వీడియో విడుదల చేశారు. “నాలుగోసారి బెయిల్, మళ్లీ ఐదోసారి అరెస్ట్… ఇది న్యాయస్థానాన్ని అపహాస్యం చేయడమే. ప్రజలంతా గమనిస్తున్నారు. మీ అహంకారం, మీ అసహనం ప్రశ్నించే గొంతుకల పట్ల మీకున్న భయాన్ని మేము చూస్తున్నాం. మా పోరాటం కొనసాగుతుంది. #justasking” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.