ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు, ఆ దేశ ప్రజలకు 250వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, అమెరికాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మించి స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ప్రజల అపరిమిత సామర్థ్యాలు.. ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడుతున్నాయని చెప్పారు. రాబోయే 250 ఏళ్లు కూడా అమెరికా మరింత ముందుకెళ్లాలని.. భారత్-అమెరికా భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.