కడప జిల్లాసున్నపురాళ్లపల్లిలో ‘జిందాల్’ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు మళ్లీ పునఃప్రారంభం కావడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగార స్థాపనకు అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, పరిశ్రమకు అవసరమైన వందలాది ఎకరాల భూమి, మౌలిక వసతుల కల్పన, తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని ఆయన వివరించారు. గతంలో తమ ప్రభుత్వం సుదీర్ఘ కృషి ఫలితంగానే ఈ రోజు రాయలసీమలో ఈ భారీ ఉక్కు కర్మాగార నిర్మాణం సాకారమవుతోందని స్పష్టం చేశారు.

