టీడీపీ పార్టీ ‘అమరావతి’ అని చెబుతున్న సమయంలో, వైసీపీ పార్టీ ‘మావిగన్’ అని చెప్పడం వంటి అర్థరహిత వాదనలను పక్కన పెట్టి, రాజధాని పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై ప్రజలకు దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేస్తోంది. దీనిలో 30 శాతం సుమారు రూ.15,000 కోట్ల అవినీతికి పథకం రచించారని, ఈ అవినీతి యజ్ఞంపై పూర్తి ఆధారాలతో త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.

