ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇరాన్ ఆహ్వానించింది. ఈ నెల 4న ఖమేని అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ప్రధాన కార్యక్రమాలు జూలై 5 నుంచి 9 వరకు జరుగుతాయి. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో అయతొల్లా ఖమేని (86)తోపాటు పలువురు అతడి కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే.