ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియా చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని వదిలేస్తుంటే చేతకానివారిలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే విమర్శలకు ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. ఇలాంటి వాటి కోసం తన ఆఫీస్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.