ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తో భేటీ అయ్యారు. ముంబై పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీలోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పులుల పునరుద్ధరణ కోసం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరారు. ప్రత్యేకంగా రెండు ఆడ పులులు ఇవ్వాలని కోరగా.. దేవేంద్ర ఫడణవీస్ వెంటనే అంగీకరించడంతో ధన్యవాదాలు తెలిపారు.