అయోధ్య రామాలయంలో విరాళాలను దుర్వినియోగం చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. నిందితుల తరపున కేసును వాదించబోమని లాయర్ల సంఘం తీర్మానించింది. నిధుల చోరీ కేసులో నిందితులను తరపున ఎవరూ వాదించరు అని, ఒకవేళ వాదిస్తే వారికి 5 లక్షల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా, గోపాల్ రావు.. తక్షణమే అయోధ్య విడిచి వెళ్లాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.