గతంలో కేంద్రం కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాను నిషేధించింది. దీనిపై జరుగుతున్న విచారణకు హాజరు కావాలని కాక్రోచ్ పార్టీ బాస్ అభిజిత్ దిప్కేకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శనివారం నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరంతరాయంగా సాగుతున్న నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న దీప్కే, ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తున్న తరుణంలో కేంద్రం నుంచి ఈ పిలుపు వచ్చింది.