రాజ్యసభ ఎన్నికలు ముగియడంతో కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల సహాయ మంత్రిగా జార్జ్ కురియన్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. జార్జ్ కురియన్ రాజీనామాతో కేంద్ర మంత్రిమండలిలో క్రైస్తవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.