గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుకు మద్దతుగా పలువురు ఆందోళన చేపట్టం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని ఆయన ఇంటి వద్ద పలువురు ప్రజలు నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ ఆందోళన చేపట్టారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారు డిమాండ్ చేశారు. తర్వాతే స్థానికంగా అసాంఘీక కార్యకలాపాలకు బ్రేక్ పడిందని వారు చెప్తున్నారు. నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ ఆందోళన చేస్తున్న వారిలో జన సేన మద్దతుదారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.