వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ ను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన జీవితంలో చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి తన తండ్రి వైయస్ఆర్ అని జగన్ భావేద్వగానికి గురయ్యారు. ప్రజల పట్ల ప్రేమతో ఉండాలని, నిస్వార్థంగా సేవ చేయాలని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తన తండ్రి చెప్పడాని గుర్తు చేసుకున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని స్మరించుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.