అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని
పుసర్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాహిరి మహాశయుల వంటి మహానుభావులు నడయాడిన బెంగాల్ ఆధ్యాత్మిక భూమిపై యోగా వేడుకలు జరుపుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. యోగా డే వేడుకలకు ప్రజలు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అభినందించారు.