పశ్చిమబెంగాల్ హుగ్లీజిల్లా తారకేశ్వర్‌లో శనివారం నిర్వహించిన పశ్చిమ్ బంగా దిబాస్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. గతంలో రక్తపాతాన్ని, ప్రాణనష్టాన్ని చవిచూసినప్పటికీ బెంగాల్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బందీగా ఉన్న బెంగాల్.. సంకెళ్ల నుంచి విముక్తి పొందిందని ప్రధాని మోడీ అన్నారు. దేశ విభజన సమయంలో రాష్ట్రాన్ని భారత్ నుంచి విడదీయడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించినందుకు ప్రజలు కాంగ్రెస్‌కు, టీఎంసీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.