‘పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ’ పథకం కింద మొదటి విడత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధికారికంగా విడుదల చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో శనివారం బహిరంగ సభలో సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. దాదాపు 46.85 లక్షల మంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.3,125 కోట్లు నేరుగా జమ అయ్యాయి. దీని ద్వారా ప్రతి రైతుకు తొలి విడత కింద రూ.7,000 చొప్పున ఆర్థిక సాయం అందింది.