మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చనే అనుమానాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.