తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా పేర్కొంది. దీంతో రెండు పార్టీల మధ్య ఉన్న 60 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై జరిగిన చర్చలే డీఎంకే, IUML మధ్య విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది.