రెండు లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్ (ఔషధాల మిశ్రమం) ఒకే మోతాదులో (సింగిల్ టాబ్లెట్ లేదా సిరప్ రూపంలో) కలిపి తయారు చేసే వాటిని ‘ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్’ (FDC) మందులు అంటారు. ఈ తరహా ఔషధాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ‘డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు’ కమిటీ మార్కెట్లో ఉన్న మందులను క్షుణ్ణంగా పరిశీలించి.. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు, వైద్యపరమైన సమర్థన లేని, హానికరమైన 16 కాంబినేషన్లను గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టింది.