అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని బొండ్రుగూడ గ్రామానికి చెందిన నరంజి అద్దు అతనితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు శనివారం (జూన్ 20) చేపల వేట కోసం సమీపంలోని బొండ్రుగూడ గెడ్డ బలిఘాట్ ప్రాంతానికి వెళ్లారు. చేపల కోసం గెడ్డలో వలలు వేస్తున్న సమయంలో నరంజి అకస్మాత్తుగా కనిపించకుండా పోయినట్లు సహచరులు కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు అయితే ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.