ఎల్బీ స్టేడియం వేదికగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ప్రభుత్వ, గురుకుల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్ లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది ఖర్చుగా కాదు.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.