బాపు ఘాట్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయడానికి మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు కేంద్ర రక్షణ శాఖ వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ భూముల విభాగం జూన్ 18, 2026 నాటి అధికారిక లేఖ ద్వారా భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ , డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.