మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో అరణ్యారామం భవన ప్రాంగణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. సూమారు రూ.24 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ అరణ్యారామం అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యక్రలాపాలతోపాటు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక నుంచి సమన్వయం చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్‌గా సేవలు అందించనుంది. రాష్ట్ర అటవీ పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు అరణ్యారామం వేదిక కానుంది.