టోలీచౌకీ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హాదీ ఇటీవల ఓ ఖరీదైన కారు కొన్నాడు. జూన్ 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు పై శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో తన మైనర్ కుమారుడికి నడిపేందుకు కారును ఇచ్చాడు. కనీసం టీనేజ్ కూడా లేని ఆ బాలుడు అర్ధరాత్రి వేళ ఓఆర్ఆర్పై కారును డ్రైవ్ చేశాడు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.