హైదరాబాద్లో కల్తీ పనీర్ ముఠాపై పోలీసులు దాడులు జరిపారు. 45 ఫుడ్ అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు చేసి 825 కిలోల అనుమానాస్పద పనీర్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో చీజ్ అనలాగ్ను పనీర్గా విక్రయిస్తున్న ముఠాల బండారం బట్టబయలు అయింది. లో ఫ్యాట్”, “ఫ్రెష్ పనీర్” పేర్లతో వినియోగదారులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ.. స్టార్చ్, అధిక నీరు, నాన్-మిల్క్ ఫ్యాట్స్ కలిపి కల్తీ పనీర్ తయారు చేస్తున్నారు.