ఆంధ్ర మెడికల్ కాలేజీ జనరల్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్న ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌ను, పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) వైద్య విద్యార్థులు చేసిన వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. డాక్టర్ కె. జనార్ధన్ రావు తన తరగతిలోని పీజీ విద్యార్థులను నోటి మాటలతో దూషించడమే కాకుండా, మహిళా విద్యార్థులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా, ఆరోపణలు నిజమని నిర్ధారించిన కమిటీ,నివేదికను వైద్య విద్యా శాఖకు సమర్పించింది వైద్యవిద్యా శాఖ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు