తిరుమల కొండపై మరోసారి హెలీకాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. బుధవారం ఉదయం ఓ హెలీకాఫ్టర్ కొండ మీదుగా వెళ్లడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయం పై నుంచి డ్రోన్లు, విమానాలు, హెలీకాప్టర్లు ప్రయాణించడం నిషేధం. అయినప్పటికీ తరచూ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని భక్తులు మండిపడుతున్నారు. పదే పదే ఇలాంటి ఘటనలు జరగడంపై టీటీడీకి ఫిర్యాదులు చేస్తున్నామని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్తున్నారు.