ఈ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. యూపీలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల్చుకోని ఎంఐఏం ఇప్పుడు మరోసారి విపక్ష కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంకేతాలు ఇచ్చారు. బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు విపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్దమని ఓవైసీ ప్రకటించారు.