ఇథియోపియాలో ఘోర రోడ్డు చోటుచేసుకుంది. ఇథియోపియాలోని అంహార రీజియన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.డెస్సీ నుంచి అడీస్ అబాబాకు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అంబులెన్స్ సేవలు లేకపోవడంతో క్షతగాత్రులను ప్రజా రవాణా వాహనాల్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.