ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్’ మెగా ఐపీఓ ద్వారా కంపెనీలో పనిచేసే సుమారు 4,400 మంది సాధారణ ఉద్యోగులు ఒకేసారి మల్టీ-మిలియనీర్లు కాబోతున్నారు. గతంలో 2 డాలర్లకే లభించిన ఈ షేర్ల విలువ 135 డాలర్లకి చేరింది. కంపెనీలోని వైట్-కాలర్ ఇంజనీర్లతో పాటు క్యాంటీన్ కార్మికులు, క్లీనింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది కూడా కోటీశ్వరుల జాబితాలో చేరిపోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, సుమారు 400 మంది ఉద్యోగుల ఆస్తి విలువ ఏకంగా 100 మిలియన్ డాలర్లు అంటే రూ.956 కోట్లు దాటబోతోంది.