భారత రక్షణ రంగాన్ని స్వదేశీ సాంకేతికతతో బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ సంస్థ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. భారత సైన్యంతో కుదుర్చుకున్న రూ. 72 కోట్ల భారీ కాంట్రాక్ట్‌లో భాగంగా, మొదటి విడత కింద 41 అత్యాధునిక ‘జేకే 250ఈ’ (JK 250E) డ్రోన్లను ఇండియన్ ఆర్మీకి విజయవంతంగా అందజేసింది. సరిహద్దుల రక్షణ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ సరికొత్త డ్రోన్లు ఒకసారి ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఎగురుతూ నిఘా ఉంచగలవు.