మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ లు ఆయా స్థానాల్లో ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అఫిడవిట్ లో క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలు సక్రమంగా పొందుపర్చని కారణంగా మీనాక్షి నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆర్వో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.

