ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రాంతీయ విదేశీ వ్యవహారాల విభాగం చీఫ్ ఎక్స్‌పర్ట్ పోలినా పోలుఖినాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం, రెండు ప్రభుత్వాల సమన్వయంతో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ అధికారికంగా వెల్లడించారు. స్మార్ట్ సిటీల నిర్వహణ మరియు సాంకేతిక పరిజ్ఞానం కోసం రష్యాలోని ప్రసిద్ధ ‘సెయింట్ పీటర్స్‌బర్గ్’ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఏపీ సర్కారు నిశ్చయించింది.

