ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ జిల్లా ప్రజలు అమాయకులు కాదని పేర్కొన్నారు. గతంలో ఓ సారి దయతలిచి కేసీఆర్ ను గెలిపించారని.. ఇక నుంచి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించనియ్యకుండా చేస్తానన్నారు. ‘పాలమూరు జిల్లా ప్రజలు మట్టి పని చేస్తారు. గుంతలు తోడుతారు. అవసరమైతే అదే గుంతలో పాతిపెడతారు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రం ఏపీతో కచ్చితంగా చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.