తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ మక్కల్ మడై అనే సరికొత్త సామాజిక-రాజకీయ వేదికను ప్రారంభించడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. మక్కల్ మడై అంటే ప్రజల వేదిక అని అర్థం. ‘మక్కల్ మడై’ అనేది ఒక స్వచ్ఛంద , సామాజిక వేదిక. ప్రజల సమస్యలను వినడానికి, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడటానికి, వారి గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు లతా రజనీకాంత్ ప్రకటించారు.