అండమాన్ నికోబార్ దీవులలో తాను పర్యటించినట్లు తెలిపిన రాహుల్ గాంధీ, అక్కడ దట్టమైన అడవులను, పగడపు దిబ్బలను, అద్భుతమైన పర్యావరణాన్ని కళ్లారా చూశానని అన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎప్పటికీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 160 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చెట్లను నరికివేయనున్నారు. ప్రభుత్వం అక్కడి స్థానిక గిరిజనుల నుంచి, సామాన్యుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోందని రాహుల్ మండిపడ్డారు.