రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామని ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో ‘నేషనల్ సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్’ వర్క్ షాప్ లో అన్నారు. దేశంలోని మత్స్యసంపదలో 28 శాతం ఏపీ నుంచే వస్తోందని చెప్పారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో దేశంలో ఏపీదే అగ్రస్థానం. రొయ్యల ఉత్పత్తిలో 66 శాతం, సీఫుడ్ ఆదాయంలో 38 శాతం మన రాష్ట్రం నుంచే వస్తోంది. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు పెరిగేందుకు కేంద్రం అండగా నిలబడాలి అని చంద్రబాబు అన్నారు.

