జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు అని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సభకు పర్మిషన్ ఇస్తే అసలు ఇష్యూనే అయ్యేది కాదు అని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్తేనే కొంతమందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.