ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూటమి మేనిఫెస్టో కాపీలను దగ్ధం చేస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు.