కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఎయిర్ పోర్టు ధ్వంసం కాగా.. ఒకరు మృతి చెందారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 1పై డ్రోన్ దాడి చేసిన వీడియోని కువైట్ విడుదల చేసింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ ప్రయాణికులు కూడా గాయపడినట్లు కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనలో ప్రాణనష్టం, తీవ్ర గాయాలు, భారీ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొంది. ఈ దాడిలో మరణించిన వ్యక్తిని భారతీయుడిగా గుర్తించారు.