పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. “మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఇతర పార్టీలతో పెట్టుకున్న పొత్తులు, తీసుకున్న యూ-టర్న్‌లను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.