ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ డేటా సెంటర్స్ పై అంశంపై రెండు విభిన్న దృక్పథాలు ఉన్నాయని, వాటిని సమతుల్యంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విధానాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. డేటా సెంటర్స్ అభివృద్ధిపై సమగ్ర, సమాచార ఆధారిత చర్చ అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను డేటా సెంటర్ హబ్ గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

