తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లాల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

