తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు అని ప్రధాని మోదీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. అలాగే, గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉందని మోదీ అన్నారు.

