పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. ఆవిష్కరించిన ఆరు నెలలకే ఈ విగ్రహాన్ని తొలగించాల్సి రావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో వీచిన బలమైన గాలుల కారణంగా ఈ భారీ విగ్రహం ప్రమాదకరంగా ఊగుతుండటంతో, స్థానికుల రక్షణను దృష్ట్యా అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.