కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా.. కెరమెరి మండలం.. కొఠారి గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను నిర్మించారు. మొదటి విడతలో భాగంగా కొఠారి గ్రామంలో నిర్మించిన కొన్ని ఇందిరమ్మ ఇళ్లకు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.