ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కురిసిన ఆకాల వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వకాలంలో జోరుగా ఇసుక దందాసాగిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ల గ్రామం నుంచి మానేరు ఇసుకను రోజు వందల లారీల్లో రవాణా చేసే వారని మంత్రి అన్నారు.